calender_icon.png 4 July, 2025 | 9:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధిత కుటుంబాలకు పరామర్శ

04-07-2025 12:58:55 AM

 సదాశివ నగర్, జులై 03(విజయక్రాంతి ): కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం లోని తుక్కోజీవాడి,  పద్మాజీవాడి, మర్కల్ గ్రామాలలో ఇటీవల మరణించిన వారి కుటుంబాలను ఎల్లారెడ్డి  ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గురువారం పరామర్శిం చారు.

పద్మాజీవాడి గ్రామంలో ఇటీవల మరణించిన కాంగ్రెస్ కార్యకర్తలు వడ్ల ఆంజనేయులు, లోకోటి బూంరావు కుటుం బలను పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు.వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆయన వెంట మండల అధ్యక్షుడు జూకంటి సంగారెడ్డి,లింగగౌడ్, మార్కెట్ కమిటీ చేర్మెన్ సంగ్య నాయక్,నాయకులు బాలయ్య, లింగారెడ్డి, నవిన్, నర్సీంలు పాల్గొన్నారు.