calender_icon.png 4 July, 2025 | 7:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సొంత నిధులతో టాయిలెట్ల నిర్మాణం

04-07-2025 12:58:47 AM

  1. రిటైర్డ్ ఉపాద్యాయుని దాతృత్వం

విద్యార్థులకు సౌకర్యం

కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు

తలకొండపల్లి, జూలై 3:అతనో పదవి విరమణ చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా    తలకొండపల్లి మండలం చుక్కాపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను గురువారం సందర్శించారు. ఆయనే మండలం లోని చీపునుంతల గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాద్యాయుడు ఎర్ర సుధాకర్ రెడ్డి. చుక్కాపూర్ ప్రాథమిక పాఠశాలలో వసతుల గురించి విద్యార్థులు,

ఉపాద్యాయులతో మా ట్లాడారు.మరుగుదొడ్లు లేకపోవడంతో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యను ఉపాద్యాయులు సుధాకర్ రెడ్డి దృష్టికి తెచ్చారు.స్పందించిన సుధాకర్ రెడ్డి విద్యార్థుల సౌకర్యర్థం పాఠశాల ఆవరణలో సొంత నిధులు వెచ్చించి మరుగుదొడ్లను నిర్మించేందుకు ముందుకు వచ్చారు.వెంటనే పనులు చేపట్టేందుకు శ్రీకారం చుట్టి పాఠశాల ఆవరణలో శంకుస్థాపన చేశారు.

నిర్మాణ పనుల ను త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు మరుగుదొడ్లును అందుబాటులోకి తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రాధానోపాద్యాయులు బాల్కొటి,మాజీ ఎంపిటిసి యాదయ్య, చీపునుంతల మాజీ సర్పంచ్ రఘుపతి,ఉపాద్యాయులు కొండల్ రెడ్డి,పాండు,పిఈటి శంకర్, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్,గ్రామస్తులు కడారి పర్వతాలు,కొడిగంటి నర్శింహా,దుగ్గాపురం రఘు, లాలయ్య,దర్వుల జంగయ్య లుపాల్గొన్నారు.