కల్తీపాల తయారీదారుడి అరెస్ట్
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 22(విజయక్రాంతి): కల్తీపాలను తయా రు చేస్తున్న ఓ నిందితుడితోపాటు ఇద్ద రు సహాయకులను పోలీసులు అదపులోకి తీసుకున్నారు. సిటీ టాస్క్‌ఫోర్స్ డీసీపీ ఎస్ రష్మీ పెరుమాళ్ తెలిపిన వివరాల ప్రకారం.. కాచిగూడ రాంకోఠికి చెందిన ప్రభాకర్‌రెడ్డి కొన్నాళ్లుగా పాల వ్యాపారం చేస్తున్నాడు. సాంద్ర త తగ్గకుండా ఉండేందుకు ప్రభాకర్‌రెడ్డి పాలలో అమోనియా సల్ఫేట్, కేసర్ ఎల్లో కలర్ కలుపుతున్నాడు. లీటర్‌కు రూ.50 చొప్పున వినియోగదారుల నుంచి తీసుకుం టూ సొమ్ము చేసుకుంటున్నాడు.
సోమవారం సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ సిబ్బంది, హబీబ్ నగర్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి నిందితుడు ప్రఓభాకర్ రెడ్డితో పాటు సహాయకులు సంతోష్ సదా, కొడిగం టి పవన్‌ను అరెస్టు చేశారు. రెండు పాల క్యాన్లతో పాటు ఇతర మెషిన్లను స్వాధీనంచేసుకున్నారు. దాడిలో సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ సీఐ ఎస్.బాలస్వామి, హబీబ్‌నగర్ సీఐ రాము, ఎస్సై సందీప్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






