15 May, 2026 | 7:27 AM

టెట్ అర్హతలేని టీచర్లు 80 వేల మంది

23-04-2024 01:52 AM

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 1.03 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో 2012 కన్నా ముందు నియమితులైన వారు 80 వేల మంది ఉంటారు. వీరికి టెట్ అర్హత లేదు. మిగతా వాళ్లంతా టెట్ అర్హత ఉన్నవారే.  2022లో ఉపాధ్యాయులకు పదోన్నతులు చేపట్టడంతో టెట్ అర్హత సమస్య మొదలైంది. పదోన్నతులకు టెట్ తప్పనిసరి కావడంతో 2015లోపు టీచర్లంతా ఉత్తీర్ణత సాధించాలని కేంద్రం కూడా అప్పట్లో గడువు విధించింది. అయితే ఆ తర్వాత దీన్ని ఐదేళ్లకు పొడిగించారు. కానీ రాష్ట్రంలో విద్యాశాఖ నూతనంగా చేపట్టే నియామకాల వరకే టెట్‌ను అమలు చేసింది. టెట్‌తో సంబంధం లేకుండానే 2022లో పదోన్నతులను కల్పించడంతో దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు ఉపాధ్యాయులు హైకోర్టుకు వెళ్లగా టెట్ తప్ప నిసరి అంటూ కోర్టు తీర్పు ఇచ్చిన విష యం తెలిసిందే. దీంతో టెట్ పరీక్ష నిర్వహించడం విద్యాశాఖకు అనివార్యమైం ది. ఈ నెల 20న దరఖాస్తు స్వీకరణకు గడువు ముగిసింది. ఖాళీలను బట్టి పదోన్నతులు టీచర్లు పొందనున్నారు.