1 July, 2026 | 7:49 PM

Breaking News

బోనమెత్తిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు   •   ఎర్రుపాలెం ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన ఎం.శారద   •   కంచర్లలో తాగునీటి సమస్యకు పరిష్కారం   •   శ్రీ ఉమామహేశ్వరంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రత్యేక పూజలు   •   విజయ క్రాంతి వార్తకు స్పందన మొలకెత్తని సోయాబీన్ పొలాలను పరిశీలించిన అధికారులు   •   డిబిఎమ్ 6 కాల్వకు గండి   •   ఓస్ట్‌ఫాలియా యూనివర్సిటీతో శాతవాహన అవగాహన ఒప్పందం   •   సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •  

నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట వేయాలి

02-06-2025 02:02 AM

మహబూబాబాద్, జూన్ 1 (విజయక్రాంతి): ఖరీఫ్ వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు మార్కెట్లోకి రాకుండా అధికారులు అప్రమత్తంగా ఉంటూ అడ్డుకట్ట వేసి రైతులకు నష్టం కలగకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని అఖిలభారత రైతుకూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జడ సత్యనారాయణ కోరారు.

ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన రైతులకు 50 శాతం సబ్సిడీపై విత్తనాలను అందజేయాలన్నారు. బ్యాంకుల్లో పెండింగ్ లో ఉన్న రుణాల విషయంలో వన్ టైం సెటిల్మెంట్ పథకాన్ని అమలు చేసి కొత్తగా రైతులకు రుణాలు అందజేయాలన్నారు.

పంటలకు ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని అమలు చేసి, కౌలు రైతులకు కూడా రైతు భరోసా పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్వామినాథన్ సిఫారసులను అమలు చేసి వ్యవసాయ రంగాన్ని పటిష్ట పరచాలని డిమాండ్ చేశారు.  ఏఐకేఎన్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండ ఐలయ్య, నాయకులు సక్రు, యాకన్న, లింగన్న, మురళి, బాబన్న, వెంకన్న, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.