1 July, 2026 | 6:42 PM

Breaking News

ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •   సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం   •  

జాతీయ విద్యా సదస్సుకు గురునాథరావు

02-06-2025 02:05 AM

మహబూబాబాద్, జూన్ 1 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండ జిల్లా పరిషత్ పాఠశాలలో భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న డాక్టర్ వి. గురునాధరావు  జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) నిర్వహిస్తున్న జాతీయ సదస్సు 202425 కు   ఎంపిక అయ్యారని జిల్లా విద్యాధికారి డాక్టర్ ఏ.రవీందర్ రెడ్డి తెలిపారు.

గురునాధరావు  ఎన్సీఈఆర్టీ నిర్వహిస్తున్న సదస్సులో వినూత్న విద్యా బోధన విధానాలు, ప్రయోగాలను ప్రదర్శిస్తారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం నుండి ప్రతిష్టాత్మక ఎన్సీఈఆర్టీ వేదికపై మూడోసారి ప్రదర్శనకు ఎంపికైన ఏకైక ఉపాధ్యాయుడు గురునాథరావు అని తెలిపారు. ఈ సదస్సు 2025 జూన్ 26 నుంచి 27 వరకు న్యూ ఢిల్లీలో జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి, విద్యా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందన్నారు.

విద్యా బోధనా శాస్త్రంలో కొత్త ఆచరణలను ప్రోత్సహించేందుకు ఈ వేదిక అత్యంత ప్రాముఖ్యత గలదన్నారు. గురునాధరావు ప్రాజెక్ట్ ‘హ్యాండ్స్ ఆన్ ఫిజిక్స్’ విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథం, అనుభవాత్మక పఠనాన్ని అభివృద్ధి చేసేలా రూపొందించబడిందన్నారు. 2018, 2022లో నిర్వహించిన సదస్సులో పాల్గొని జాతీయ స్థాయి అవార్డులు గురునాధరావు అందుకున్నారని డీఈవో తెలిపారు.

ఆయనకు రెండు డాక్టరేట్ డిగ్రీలు ఉండగా, సుమారు 100 పరిశోధనా పత్రాలను వివిధ యూనివర్సిటీలు , ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు నిర్వహించిన, సదస్సులలో, సెమినార్లలో సమర్పించిన గొప్ప అనుభవం ఉందన్నారు. సదస్సుకు ఎంపికైన గురునాధరావు కు, ఆయనను ప్రోత్సహించిన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కె.యాదగిరి కి జిల్లా విద్యాశాఖ తరఫున డిఇఓ వారికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.