13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

కురవి దేవాలయ హుండీ లెక్కింపు

26-03-2026 01:48 AM

మహబూబాబాద్, మార్చి 25 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన కురవి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయంలో హుండీల లెక్కింపు నిర్వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 10 నుండి 24 మార్చి వరకు 21 హుండీల్లో భక్తులు వేసిన కానుకలను లెక్కించారు. ఇందులో స్వామివారి ఆలయంలోనీ హుండీలో 23,17,756 రూపాయలు కానుకలుగా లభించగా, అమ్మవారి ఆలయంలోనీ హుండీలో 7,05,042 రూపాయలు లభించినట్లు అధికారులు తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కొర్ను రవీందర్ రెడ్డి, దేవాదాయ శాఖ అధికారులు, సేవా ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.