భద్రకాళి అమ్మవారికి చామంతులతో లక్ష పుష్పాభిషేకం
26-03-2026 01:47 AM
వరంగల్, మార్చి 25 (విజయక్రాంతి): చారిత్రక వరంగల్ నగరంలోని భద్రకాళి అమ్మవారి దేవాలయంలో వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు బుధవారం అమ్మవారికి తెల్ల చామంతి పూలతో లక్ష పుష్పాభిషేకం నిర్వహించారు. పెద్ద ఎత్తున ఆలయానికి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.




