13 July, 2026 | 1:49 AM

దేశంలోనే తొలి ఫెస్టివోగ్ స్టోర్ నగరంలో ఏర్పాటు

13-07-2026 12:00 AM

సంస్థ వ్యవస్థాపకురాలు భావనా ధనేకుల

జూబ్లీహిల్స్, జూలై 12 (విజయక్రాంతి): అమెరికాలో పేరుగాంచిన ప్రీమియం లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ ఫెస్టివోగ్ స్టోర్ నగరంలో ఏర్పాటైంది. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 10లో నూతనంగా ఏర్పాటు చేసిన స్టోర్ ప్రారంభోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. సినీ ప్రముఖులు శ్రియ చరణ్, మం చు లక్ష్మి, నవదీప్ స్టోరును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫెస్టివోగ్ వ్యవస్థాపకురాలు భావనా ధనేకుల మాట్లాడుతూ దేశంలోనే తొలి స్టోర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సంప్రదాయం, ఆధునికతను సమన్వయం హైదరాబాద్ సమన్వయం చేస్తోందన్నారు. నగరంలోని ప్రత్యేక చేనేత, నాణ్యతమైన కళాత్మక దుస్తులకు విశేషణ ఆదరణ ఉందని పేర్కొన్నారు.

అందుకే తమ తొలి స్టోరును హైదరాబాద్‌లో ఏర్పాటు చేశామని భావనా తెలియజేశారు. చేనేత చీరలు, బ్రైడల్ చీరలు, డిజైనర్ లెహంగాలు, కౌట్యూర్ కలెక్షన్లు, పురుషుల సంప్రదాయ దుస్తులు, కుర్తా సెట్లు, పిల్లల దుస్తులు తదితర విభాగాల్లో ప్రత్యేక కలెక్షన్లు స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. సినీ ప్రముఖులు మాట్లాడుతూ ఫెస్టివోగ్ స్టోర్ భారతీయ లగ్జరీ ఫ్యాషన్ రంగంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిందన్నారు. ప్రత్యేకమైన వేడుకల కోసం అరుదైన, విలాసవంతమైన వస్త్రా లను కోరుకునే వారికి ఫెస్టివోగ్ ప్రీమియం గమ్యస్థానంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రారంభోత్సవంలో పలువురు ప్రముఖులు, స్టోర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.