calender_icon.png 22 December, 2025 | 3:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లోక్ అదాలత్‌తో కలిసిపోయిన దంపతులు

22-12-2025 12:00:00 AM

గజ్వేల్ డిసెంబర్ 21: కుటుంబ కలహాలతో నాలుగేళ్లుగా విడిపోవాలని ప్రయత్నించిన ఓ జంట లోక్ అదాలత్ తో ఒకటయ్యింది. గజ్వేల్ లో ఉపాధి పొందుతూ జీవనం సాగిస్తున్న మా ర్వాడి దంపతులు కుటుంబ కారణాలవల్ల నాలుగు సంవత్సరాలుగా విడాకులకు గజ్వేల్ కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఆదివారం గజ్వేల్ కోర్టు ఆవరణలో జరిగినలోకాదాలత్ లో జడ్జితో పాటు ఇరువైపులా న్యాయవాదులు, బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పి నరేష్ చారి, జయం వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారిరువురిని కలిపారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ స్వాతి గౌడ్ సమక్షంలో దంపతులు భేదాభిప్రాయాలు పక్కనపెట్టి మరోసారి దండలు మార్చుకొని ఒక్కటయ్యారు.