సత్య సాయిబాబా ఆధ్వర్యంలో మెగా వైద్యశిబిరం
జహీరాబాద్, డిసెంబర్ 21: మానవసేవయే మాధవ సేవ అని శ్రీ సత్య సాయిబాబా ట్రస్ట్ పేర్కొంది. శ్రీ సత్య సాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంగం మండలం కుప్పానగర్ గ్రామంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఉదయం నగర సంకీర్తనతో ప్రారంభమైన కార్యక్రమాలు పశువైద్య శిబిరం, అక్షరాభ్యాసం, మెగా వైద్య శిబిరం, ఉచిత మందుల పంపిణీతో పాటు బీదలకు నెలకు సరిపడే నిత్యవసర సరుకులను అందజేశారు.
దీంతోపాటు వృద్ధులైన భార్యాభర్తలకు శత జయంతి ఉత్సవాన్ని జరిపి వారికి మళ్ళీ నూతనంగా వివాహం జరిగినట్లు పూలదండలను మార్పించారు. వృద్ధులకు చేతి కర్రలను, పాఠశాల విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లను, బీద బడుగు బలహీన వర్గాల వారికి దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్య సాయిబాబా జహీరాబాద్ సభ్యులు పాల్గొన్నారు. ఈ శిబిరంలో జహీరాబాద్ కు చెందిన నీలం హాస్పిటల్ డాక్టర్లు స్వచ్ఛందంగా వివిధ రుగ్మతలు కలిగిన వారికి ఉచిత పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.




