calender_icon.png 22 December, 2025 | 4:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాక వెంకటస్వామి వర్ధంతి వేడుకలు

22-12-2025 02:42:14 PM

మంథని మండల  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా కాక వెంకటస్వామి వర్ధంతి వేడుకలు 

మంథని,(విజయక్రాంతి): రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మండల అధ్యక్షులు ఆయిలి ప్రసాద్  ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్వర్గీయ (కాకా) గడ్డం వెంకటస్వామి  చిత్రపటానికి పూలమాలలేసి ఘనంగా వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మండల అధ్యక్షులు ఆయిలి ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, జిల్లా ఉపాధ్యక్షులు నూకల బానయ్య, ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం, మాజీ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎరుకల ప్రవీణ, బీసీ సెల్ మండల అధ్యక్షులు ఐలి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ కొండ శంకర్ మాట్లాడుతూ... కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి వర్ధంతి సందర్భంగా కాకా సేవలను కొనియాడారు.

తెలంగాణ ఏర్పాటులో కాకా కీలక పాత్ర పోషించారని తెలిపారు. హైదరాబాద్ లో ఇండ్లు లేని వేలాది మందికి గుడిసెలు వేయించారని గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని చెప్పారు. “ఇండ్లు లేని పేదలకు కాకా గుడిసెలు వేయించారని, సుమారు 75 వేల మందికి పట్టాలు ఇప్పించారని, ప్రైవేట్ రంగంలో తొలిసారి పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చారని గుర్తు చేశారు. కాకా వెంకటస్వామి వారసులు గడ్డం వివేక్ గాని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వారి వారసత్వాన్ని ముందు తీసుకెళుతుదుందన్నారు  వారి గెలుపులో మంత్రి శ్రీధర్ బాబు, మా యువనేత దుద్దిళ్ళ శ్రీను బాబు  ముఖ్య పాత్ర పోషించి పెద్దపల్లి ఎంపీ గా  గడ్డం వంశీకృష్ణ ను అధిక మెజార్టీతో గెలుపులో తోడైనారని, వారు పెద్దపెల్లి ఎంపీగా మంథని నియోజక వర్గానికి ఎంపీ నిధులను కేటాయించి ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పాటు చేయాలని నాయకులు అన్నారు. కాగా వెంకటస్వామి ఆనాడు సింగరేణి మరి ఎఫ్సీఐ కంపెనీలు నష్టాలలో కురుకుపోతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం తోటి కొట్లాడి దానికి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి లాభాల బాటలో వేసినటువంటి మహానేత వెంకట స్వామి అని కొనియాడారు.  ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు, అనుబంధ సంఘాల నాయకులు, అన్ని విభాగాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు.