calender_icon.png 22 December, 2025 | 4:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు చేయాలి

22-12-2025 02:51:19 PM

ఖానాపూర్ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులు వెడమ బొజ్జు పటేల్

ఖానాపూర్,(విజయక్రాంతి): స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులు పాలకవర్గం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు చేయాలని ఎటువంటి అభివృద్ధి పనులైన తన దృష్టికి తీసుకురావాలని డిసిసి అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమా బొజ్జు పటేల్ అన్నారు. సోమవారం ఖానాపూర్, పెంబి, కడం, దస్తురాబాద్ మండలాల్లో సర్పంచ్ వార్డు సభ్యుల ప్రమాణస్వీకారాలకి హాజరై ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా పలువురు సర్పంచులకు తగు దిశా నిర్దేశం చేశారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకూడదని అందుకు తగ్గట్టుగా గ్రామాలను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో చిత్తశుద్ధితో ఉన్నదని ఆయన పేర్కొన్నారు. మేరకు మస్కాపూర్, పెంబి, తర్లపాడు, అనంతరం అన్ని గ్రామాల్లో ఆయన పర్యటించారు.