calender_icon.png 22 December, 2025 | 2:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గీతంను సందర్శించిన ట్రిపుల్ ఐడీ హైదరాబాద్ మేనేజింగ్ కమిటీ

22-12-2025 12:00:00 AM

పటాన్ చెరు, డిసెంబర్ 21: ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంటీరియర్ డిజైనర్స్ (ఐఐఐడీ), హైదరాబాదు ప్రాంతీయ చాప్టర్ యొక్క మేనేజింగ్ కమిటీ సభ్యులు అధికారక సందర్శనలో భాగంగా, హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ను ఇటీవల సందర్శించారు.సందర్శనలో భాగంగా, ఆర్కిటెక్చర్ స్కూల్ విద్యా వ్యవస్థ, అక్కడి స్థితిగతులు, కీలకమైన మౌలిక సదుపాయాలను కమిటీ సమీక్షించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టూడెంట్స్ వర్క్ ఎగ్జిబిషన్ ప్రధాన ఆకర్షణగా నిలవగా, కమిటీ సభ్యులు అక్కడున్న విద్యార్థులతో నేరుగా సంభాషించారు.

ఆవిష్కరణ, డిజైన్ సున్నితత్వం, విద్యాపరమైన కఠోరతను ప్రతిబింబించే విద్యా ప్రాజెక్టుల ప్రత్యేక ప్రదర్శనను కూడా కమిటీ సభ్యులు వీక్షించారు.ట్రిపుల్ ఐడీ ప్రతినిధి బృందాన్ని ఉద్దేశించి గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డైరెక్టర్ ఆర్. బందన్ కుమార్ మిశ్రా ప్రసంగించారు. ఆర్కిటెక్చర్ విద్యలో రాణించడానికి సంస్థ యొక్క నిబద్ధతను పునరుద్ఘాటించడంతో పాటు ట్రిపుల్ ఐడీ హైదరాబాదు చాప్టర్ సహకారం యొక్క ప్రాముఖ్యతను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. అర్థవంతమైన విద్య, వృత్తిపరమైన సహకారాల ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్శనను అసిస్టెంట్ ప్రొఫెసర్ స్నిగ్ధ రాయ్ సమన్వయం చేశారు.