నిలిచిపోయిన బోథ్ మేజర్ పంచాయతీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం
22-12-2025 02:44 PM
బోథ్,(విజయక్రాంతి) : ఆదిలాబాద్ జిల్లా బోథ్ మేజర్ గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం నిలిచిపోయింది. వార్డు మెంబర్ల గైర్హాజరుతో సోమవారం సాయంత్రం 4 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ఎంపీడీఓ రమేష్ వెల్లడించారు. పంచాయతీ పరిధిలో మొత్తం 16 మంది వార్డు మెంబర్లకు గాను 13 మంది మాత్రమే హాజరయ్యారు. ఉప సర్పంచ్ ఎన్నిక విషయంలో జరిగిన లావాదేవీల విషయంలో జరిగిన విభేదాలే గైర్హాజరుకు కారణమని పరిశీలకులు అంటున్నారు.






