సర్పంచ్ గా అరుణా దేశ్ పాండు ప్రమాణస్వీకారం
22-12-2025 02:47 PM
మఠంపల్లి,(విజయక్రాంతి): సూర్య పేట జిల్లా మఠంపల్లి మండలంలోని కొత్త దొనబండ తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ గా బానోతు అరుణా దేశ్ పాండు నాయక్ సోమవారం అట్టహాసంగా ప్రమాణస్వీకారం చేశారు.గ్రామ ప్రజలు, వార్డు సభ్యులు కార్యకర్తలు యువత అందరూ ఊరేగింపు గా బయలుదేరి గ్రామ పంచాయతీ లో కార్యదర్శి సమక్షంలో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తండా ప్రజలు నా మీద నమ్మకంతో గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. పార్టీలకు అతీతంగా సేవా చేస్తానని హామీ ఇచ్చారు.ఈ ప్రమాణస్వీకారానికి ముఖ్య అతిథులుగా హుజూర్ నగర్ మాజీ కౌన్సిలర్, న్యాయవాది జక్కుల వీరయ్య, మఠంపల్లి మాజీ జెడ్పిటిసి సైదులు తదితరులు పాల్గొన్నారు.






