calender_icon.png 2 August, 2025 | 11:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డిలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆవుపాల పంపిణీ

30-07-2025 12:42:57 AM

కామారెడ్డి అర్బన్, జూలై 29 (విజయ క్రాంతి): కామారెడ్డి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో  నాగుల పంచమి సందర్భంగా మంగళవారం ఆవు పాలను పంపిణీ చేశారు.  రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ఆధ్వర్యంలో  నాగుల పంచ మిని పురస్కరించుకొని రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ఆధ్వర్యంలో ఆవుపాల ను పంపినీ చేశారు. ఈ సందర్భంగా రోటరీ అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ ఎం జైపాల్ రెడ్డి, ప్రెసిడెంట్ శంకర్  మాట్లాడుతూ పవిత్రమైన నాగుల పంచమి రోజున ఆవుపాలని వితరణ చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.

100 మందికి పైగా ఆవు పాలను పంచడం జరిగిందని తెలిపారు.  ఈ ఆవు పాల వితరణ చేయడం వల్ల కాలనీవాసులు, కామారెడ్డి ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి కార్యక్రమాలు రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి  ఆధ్వర్యంలో ఎల్లప్పుడూ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ ఎం జైపాల్ రెడ్డి, ప్రెసిడెంట్ శంకర్ , సెక్రటరీ కృష్ణ హరి, ట్రెజరర్ రమణ,  రాజనర్సింహారెడ్డి, బాలకిషన్, నాగభూషణం,  సుధాకర్ రావు, అమర్, తదితరులు పాల్గొన్నారు.

ఎల్లారెడ్డి పట్టణంలో ..

ఎల్లారెడ్డి, జులై 29 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో మంగళవారం నాగుల పంచమి సందర్భంగా భక్తిమయ వాతావరణంలో వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించుకున్నారు. పట్టణ కేంద్రంలోని ప్రసిద్ధ  ముత్యాల పోచమ్మ ఆలయం లో మహిళ భక్తుల సందడితో కళకళలాడింది. ఉదయం నుండి మహిళ భక్తులు ఆలయానికి చేరుకుని, నాగదేవతలకు పాలు, జొన్న ప్యాలలు సమర్పిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాలు శోభాయమానంగా అలంకరించబడి, భక్తుల ఆరాధనలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. స్త్రీ, పురుషులు, పిల్లలు ఉత్సాహంగా పాల్గొని, నాగదేవతల ఆశీస్సులు పొందేందుకు పుష్పాలు, పసుపు, కుంకుమలతో పూజలు చేశారు. స్థానికులు ఈ పవిత్ర కార్యక్రమం ద్వారా శాంతి, సౌభాగ్యాలను కోరుకున్నారు.