calender_icon.png 2 August, 2025 | 1:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జోగుళాంబ ఆలయాలకు రూ.లక్ష విరాళం

30-07-2025 12:41:46 AM

అలంపూర్ ,జూలై 29 దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న అలంపురం శ్రీ జోగుళాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలకు ఓ భక్తుడు భారీ విరాళాన్ని అందజేసి అమ్మవారి పట్ల వారికున్న భక్తిని చాటుకున్నారు. హైదరాబా ద్ కు చెందిన మధులత, వేణుగోపాల్ రెడ్డి దంపతులు శ్రీ జోగుళాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను మంగళవారం దర్శించుకున్నారు.

అనంతరం వారు ఉభయ ఆల యాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయాల అభివృద్ధి కొరకు త మ వంతు సాయం రూ.1 లక్ష రూపాయల చెక్కును ఆలయ ఈవో పురంధర్ కుమార్ కు అందజేశారు.అనంతరం వారికి ఈవో శాలువా కప్పిసన్మానించారు.