16 May, 2026 | 7:01 PM

Breaking News

పేదలు ఉచిత న్యాయ సేవలు పొందాలి   •   పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని దిష్టిబొమ్మ దగ్ధం చేసిన సీపీఐ ఎం.ఎల్ న్యూడెమోక్రసీ   •   అనురాగ్ లో “హెటెరో ల్యాబ్స్ ఎస్ఎంటీ బ్రిడ్జ్ కోర్స్ 2026–27” ప్రోగ్రాం   •   గ్రామపంచాయతీ కార్మికుల జీతాలు పెంచాలి   •   అమరవీరులకు నివాళులు అర్పించిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ప్రధాన కార్యదర్శి సంజీవరెడ్డి   •   తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి   •   కొనుగోలు చేసిన మక్కలని వెంటనే తరలించాలి   •   జాబ్ మేళాలో ఉద్యోగాల ఎంపిక   •   గ్రామంలో బెల్ట్ షాప్ లను ముసివేయాలి   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •  

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు

16-05-2026 06:00 PM

మెరుగైన సాగు పద్ధతులపై రాఘవపూర్‌లో అవగాహన కార్యక్రమం

సిద్దిపేట జిల్లా: వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించడంతో పాటు ఖర్చులను తగ్గించుకునేందుకు శాస్త్రీయ సాగు పద్ధతులను రైతులు అనుసరించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. సిద్దిపేట జిల్లా రాఘవపూర్ గ్రామంలో శనివారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని నిర్వహించి రైతులకు పంటల సాగుపై సమగ్ర అవగాహన కల్పించారు. వ్యవసాయ పరిశోధన స్థానం తోర్నాల ఆధ్వర్యంలో, జిల్లా వ్యవసాయ శాఖ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్త డా. ఏ. రమాదేవి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా కేఎన్‌ఎం-1638, బీపీటీ-5204, డబ్ల్యూజీఎల్-44 వరి రకాలను సాగు చేయాలని సూచించారు.

ప్రత్యామ్నాయ పంటల సాగు, నేల పరీక్షల ఆధారంగా యూరియా వినియోగం, పంటల అవసరానికి అనుగుణంగా రసాయనాల వాడకం, నేల సంరక్షణ, పచ్చిరొట్ట ఎరువుల వినియోగంపై రైతులకు వివరించారు. మండల వ్యవసాయ అధికారి ఎం.నరేష్ మాట్లాడుతూ... రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఎఫ్పిఓ ద్వారా పంట సాగు చేస్తే మార్కెటింగ్‌లో మెరుగైన లాభాలు పొందవచ్చన్నారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న వరి రకాలను ఎంపిక చేసుకోవడంతో పాటు పచ్చిరొట్ట పంటలను తప్పనిసరిగా సాగు చేయాలని సూచించారు.