13 April, 2026 | 11:53 AM

Breaking News

మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో ఘోర రోడ్డుప్రమాదం: ట్రక్కు ఢీకొని ఏడుగురు దుర్మరణం   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •   మంత్రి తుమ్మలను కలిసిన మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు   •   రెడ్డిపల్లి కార్బన్ రిసోర్సస్ సంస్థ వివాదం – హైకోర్టు ఆదేశాలు, అధికారుల అడ్డంకులు   •  

డాక్టర్ సీటు సాధించిన పోలీసుల పిల్లలను అభినందించిన సీపీ

09-10-2025 06:27 PM

హనుమకొండ (విజయక్రాంతి): ఎంబీబీఎస్ లో సీటు సాధించిన పోలీస్ పిల్లలను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఘనంగా సత్కరించి అభినందనందించారు. కొద్ది రోజుల క్రితం ఎంబీబీఎస్  మొదట విడత కౌన్సిలింగ్లో సెంట్రల్ జోన్ షేక్ సలీమా కుమార్తె తాన్య సభ హైదరాబాద్ గాంధీ మెడికల్ కళాశాలలో సీటు సాధించగా, హోంగార్డ్ బాలకిషన్  కుమారుడు ముప్పా చందుకు మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు సాధించాడు, మరో హోంగార్డ్ మోహన్ కుమార్తె భవాని ఆసిఫాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలో సీటు సాధించింది.

ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎన్ని ఒత్తిళ్ళు వున్న పిల్లలు చదువుల పట్ల అశ్రద్ధ వహించవద్దని వారిని ఉన్నత చదువులు చదివే విధంగా ప్రోత్సాహించాలని, తమ పిల్లలు యం. బి. బి. ఎస్ సీటు సాధించడం కృషి చేసిన తల్లిదండ్రులకు పోలీస్ కమిషనర్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, అడిషనల్ డీసీపీ లు శ్రీనివాస్, ప్రభాకర్ రావు, ఏసీపీ నాగయ్య, ఆర్ఐ చంద్రశేఖర్ తో హోం గార్డ్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.