09-10-2025 06:18:57 PM
గ్రామపంచాయతీ కార్యాలయంలో కొనసాగుతున్న పాఠశాల..
తీవ్ర ఎండలోనే విద్యార్థుల మధ్యాహ్న భోజనం..
తాండూరు (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం ఎర్రగడ్డ తండాలో పాఠశాల భవనం లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నూతన పాఠశాల భవన నిర్మాణం కోసం రెండేళ్ల క్రితం ప్రారంభించిన పనులు పిల్లర్ల వరకే పరిమితమయ్యాయి. దీంతో పంచాయతీ భవనంలో ఉన్న ఒకే ఒక గదిలో ఒకటవ తరగతి నుండి 5వ తరగతి వరకు 45 మంది విద్యార్థులగాను ఇద్దరు ఉపాధ్యాయులతో పాఠశాల కొనసాగుతుంది. త్రాగేందుకు నీరు లేక విద్యార్థులు సీసాల్లో ఇంటి నుండి తీసుకొని వస్తున్నారు. ఇక మధ్యాహ్న భోజనం ఎండలోనే చేస్తున్న తీరు చూపరులను కలచి వేస్తుంది.