09-10-2025 06:29:15 PM
బీఆర్ఎస్ పార్టీ మండల కార్యదర్శి జీడి సుందర్..
జాజిరెడ్డిగూడెం/అర్వపల్లి: రాష్ట్రంలో పాలన విధానాన్ని రేవంత్ సర్కార్ ఖూనీ చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ జాజిరెడ్డిగూడెం మండల కార్యదర్శి జీడి సుందర్ గురువారం ఒక ప్రకటనలో ఆరోపించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని,బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ సర్కార్ చిత్తశుద్ధితో పనిచేయడం లేదని అన్నారు. కోర్టుల్లో కేవలం హడావుడి చేస్తుందని, స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో గందరగోళ పరిస్థితులను సృష్టిస్తున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.