calender_icon.png 10 October, 2025 | 9:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డాక్టర్ సీటు సాధించిన పోలీస్ పిల్లలను అభినందించిన సీపీ

10-10-2025 01:20:18 AM

హనుమకొండ అక్టోబర్ 9 (విజయక్రాంతి): ఎంబీబీఎస్‌లో సీటు సాధించిన పోలీస్ పిల్లలను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్  ఘనంగా సత్కరించి అభినందనందించారు. కొద్ది రోజుల క్రితం యం.బి.బి.ఎస్ మొదట విడత కౌన్సిలింగ్లో సెంట్రల్ జోన్ షేక్ సలీమా కుమార్తె తాన్య సభ హైదరాబాద్ గాంధీ మెడికల్ కళాశాలలో సీటు సాధించగా, హోంగార్డ్ బాలకిషన్  కుమారుడు ముప్పా చందుకు మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు సాధించాడు,మరో హోం గార్డ్  మోహన్ కుమార్తె  భవాని ఆసిఫాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలో సీటు సాధించింది.

ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎన్ని ఒత్తిళ్ళు వున్న పిల్లలు చదువుల పట్ల అశ్రద్ధ వహించవద్దని వారిని ఉన్నత చదువులు చదివే విధంగా ప్రోత్సాహించాలని, తమ పిల్లలు యం. బి. బి. ఎస్ సీటు సాధించడం కృషి చేసిన తల్లిదండ్రులకు పోలీస్ కమిషనర్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, అడిషనల్ డీసీపీ లు శ్రీనివాస్, ప్రభాకర్ రావు, ఏసీపీ నాగయ్య, ఆర్. ఐ చంద్రశేఖర్ తో హోం గారడ్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.