పోలీసుల ఆరోగ్యంపై సీపీ దృష్టి
సైబరాబాద్ ఉచిత వైద్య శిబిరంలో పరీక్షలు చేయించుకున్న సీపీ ఎం.రమేష్
శేరిలింగంపల్లి,ఆగస్టు 31 (విజయక్రాంతి): సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉచిత వైద్య శిబిరం ప్రారంభమైంది. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సిఎస్సి), గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సంయుక్తంగా సీఏఆర్ హెడ్క్వార్టర్స్ సీ టీసీలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని సోమవారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్ పరిశీలించారు. శిబిరంలో సీపీ స్వయంగా కంటి పరీక్ష, బీపీ పరీక్ష చేయించుకున్నారు.
వైద్యులతో మాట్లాడి అందుబా టులో ఉన్న పరీక్షలు, సేవల వివరాలు తెలుసుకున్నారు. ఎత్తు, బరువు, బీఎమ్‌ఐ, ఈ సీజీ, కంటి, దంత పరీక్షలతో పాటు పిల్లలకు ప్రత్యేక ఐ స్క్రీనింగ్, అవసరమైన వారికి ఫిజియోథెరపీ సేవలు ఉచితంగా అందిస్తున్నా రు. పోలీసు సిబ్బంది విధుల్లో నిరంతరం ఒత్తిడి, పనిభారం ఎదుర్కొంటున్నారని సీపీ అన్నారు. అందుకే వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని స్పష్టం చేశారు.
ప్రతి పోలీసు ఉద్యోగి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సిబ్బంది ఆరోగ్య వివరాలను ‘ఆరోగ్య భద్ర త’ హెల్త్ ప్రొఫైల్లో నమోదు చేసి హెచ్‌ఆర్‌ఎమ్‌ఎస్లో అప్లోడ్ చేయాలని యూనిట్ వైద్యు లకు ఆదేశించారు. డిజిటల్ రికార్డు ఉంటే అవసరమైనప్పుడు ఆరోగ్య చరిత్ర సులభంగా చూసి మెరుగైన చికిత్స అందించవ చ్చని చెప్పారు.పోలీసులు మాత్రమే కాదు..
వారి కుటుంబ సభ్యులు, సాధారణ ప్రజలు కూడా ఈ శిబిరాన్ని వినియోగించుకుని ము ందుగానే ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవాలని సీపీ పిలుపునిచ్చారు.ఈ ఉచిత వైద్య శిబిరం ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 5 వరకు ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయం త్రం 5 గంటల వరకు ఎస్సిఎస్సి క్యాంపస్లో కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ అన్నపూర్ణ, ఎస్సిఎస్సి సీఈఓ నవీద్, హెడ్క్వార్టర్స్ అడిషనల్ డీసీపీ షమీర్, సీటీసీ వైద్యులు సుకుమార్, సరిత, పోలీసు అధికారులు, వైద్య బృందం పాల్గొన్నారు.






