బాలాజీ నగర్ లో శ్రీ మడేలయ్య స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం
హాజరైన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి
కోదాడ,(విజయక్రాంతి): పట్టణంలోని బాలాజీ నగర్ లో నూతనంగా నిర్మించిన శ్రీ మడేలయ్య స్వామి ఆలయ గ్రహ ప్రతిష్టా మహోత్సవ పూజా కార్యక్రమం సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ మడేలయ్య స్వామి విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాలలో పాల్గొన్నారు. వేద పండితులు ఆమెకు ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు అందజేశారు.
అనంతరం ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ... శ్రీ మడేలయ్య స్వామి ఆలయ నిర్మాణ దాత ఏడవ వార్డు కౌన్సిలర్ మాలోతు చైతన్య నాయక్ ను ఆయన కుటుంబ సభ్యులను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. విగ్రహ దాత నర్సింహ నాయక్, రమాదేవి, టైల్స్ దాత రాజేష్ నాయక్, వసంత దంపతులను ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ బాబు, వైస్ చైర్మన్ మల్లేశ్వరి, పిల్లుట్ల శ్రీను, స్థానిక ప్రజా ప్రతినిధులు రాజకీయ నాయకులు, కమిటీ సభ్యులు, బాలాజీ నగర్ కాలనీ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు.






