16 April, 2026 | 8:13 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సీపీ

06-02-2026 02:09 AM

మంచిర్యాల, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా మంచిర్యాల పట్టణంలోని గరల్స్ హై స్కూల్‌లోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్‌తో కలిసి పరిశీలించారు. బాలికల హై స్కూల్‌లో ఏర్పాటు చేసిన 59, 60 డివిజన్ల పోలింగ్ కేంద్రాలను పరిశీలించి, అక్కడి పరిసరాలను సమీక్షించారు. శాంతి భద్రతల పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను, సూచనలను చేశారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడు తూ ప్రజలు భయభ్రాంతులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణాన్ని కల్పించడానికి, ఉద్రిక్తతలు చోటుచేసు కోకుండా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారన్నారు. చట్టవిరుద్ధ చర్యలు ఎవరు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీరి వెంట మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్, మంచిర్యాల పట్టణ సీఐ ప్రమోద్ రావు, ఎస్‌ఐలు, తదితరులున్నారు.