22-12-2025 12:00:00 AM
టేకులపల్లి, (విజయక్రాంతి): టేకులపల్లి మండలంలో 36 గ్రామ పంచాయతీలలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు సోమవారం కొలువుదీరనున్నారు. వీరి ప్రమాణస్వీకారం కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లా పంచాయతీ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాట్లను మండలాల పరిధిలో ఎంపీడీవోలు, ఎంపీవోలు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటి వరకు గ్రామా ల్లో కార్యదర్శులు, ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది.
గ్రామ పాలకవర్గం ఎన్నిక కావడంతో ప్రత్యేక అధికారుల పాలన కాలం నేటితో ముగియనుంది. పదవీ ప్రమాణస్వీకారం చేసి నప్పటి నుంచి ఐదేళ్ల పాటు సర్పంచులు, వార్డు సభ్యులు పదవుల్లో కొనసాగనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయా గ్రామాల పరిధిలో ఒకే రోజు ప్రమాణస్వీకారం చేయించే వి ధంగా అధికారులు ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీల్లో పాలకవర్గాల ప్రమాణస్వీకారం కో సం కొత్తగా ఎన్నికైన వార్డు సభ్యులు, సర్పంచులు కూడా భారీ ఏర్పాట్లను చేసుకుంటున్నారు.
పార్టీల మద్దతుతో గెలిచిన సర్పంచులు తమ నేతలను ఆహ్వానించి ప్రమాణస్వీకారం చేయించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ప్రమాణస్వీకారం రోజున భారీ స్థాయిలో కార్యక్రమాలు చేప ట్టేందుకు సిద్ధమవుతున్నారు. గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించడంతో పాటు సంబరాలు జరుపుకునేందుకు ఏర్పాట్లను చేసుకుంటున్నారు.
గడిచిన 20 నెలలుగా పాలకవర్గాలు లేక పోవడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి పంచాయతీలకు వచ్చే నిధులు విడుదల కాలేదు. అప్పటి నుంచి పంచాయతీలకు కేవలం రాష్ట్ర ప్రభుత్వ నిధులే వచ్చాయి. పాలకవర్గాలు కొలువుదీరగానే కేంద్రం నుంచి పంచాయతీలకు రావాల్సిన ఆర్థిక సంఘం నిధులు ఒకేసారి రానున్నాయి.