calender_icon.png 26 December, 2025 | 9:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పోరాడే పార్టీ సిపిఐ

26-12-2025 07:36:47 PM

పలువురు యువకులు సిపిఐ పార్టీలో చేరిక

సిపిఐ మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి తోటపల్లి శంకర్

జవహర్ నగర్,(విజయక్రాంతి): బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పోరాడే పార్టీ సిపిఐ పార్టీయేనని మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జ్ తోటపల్లి శంకర్ అన్నారు. సిపిఐ 101వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల  సందర్భంగా కాప్రా మండల సమితి ఆధ్వర్యంలో జవహర్ నగర్ రావి నారాయణరెడ్డి నగర్ (సిపిఐ కాలనీ) లో సిపిఐ కార్యాలయపు ఆవరణలో సిపిఐ జెండాను మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విఎస్ బోస్ మాట్లాడుతూ... 1925 డిసెంబర్ 26న సిపిఐ పార్టీ ఖానాపూర్ లో ఆవిర్భవించిందని అప్పటినుండి నేటి వరకు అనేక ఉద్యమాలు పోరాటాలు ఉద్యమాలు నిర్వహించిన పార్టీ సిపిఐ పార్టీ అని చట్టసభల్లో కార్మికులకు కర్షకులకు చట్టాలను చేయించినటువంటి ఘనత సిపిఐ పార్టీకే దక్కుతుందన్నారు.

దేశ చరిత్రలో ఉద్యమాలలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించి అనేకమంది కమ్యూనిస్టులు వీరమరణం పొందిన పార్టీ సిపిఐ లోనే ఉన్నారన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించి తెలంగాణలోని 3 వేల గ్రామాలను విముక్తి చేసి పది లక్షల ఎకరాల భూమిని నిరుపేదలకు పంచిన ఘనత ఒక్క సీపీఐ పార్టీకే దక్కుతుందన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో సిపిఐ పార్టీ కీలక భూమిక పోషించిందని తెలంగాణ ఉద్యమంలో పార్టీ అవిశ్రాంత పోరాట ఫలితంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడంలో పార్టీ చేసిన కృషి మరువ లేమన్నారు.

అనంతరం ఉమా మహేష్ మాట్లాడుతూ సిపిఐ పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వచ్చే నెల జనవరి 18వ తేదీన ఖమ్మంలో నిర్వహించబోయే సజాతి ముగింపు చోళ బహిరంగ సభను జయప్రదం చేయాలని కమ్యూనిస్టు నాయకులు కార్యకర్తలు కార్మికులు కర్షకులు మేధావులు అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం పలువురు యువకులను పార్టీలో చేర్చుకున్నారు.

ఈ కార్యక్రమానికి దర్శనం యాదగిరి అధ్యక్షత వహించారు. అనంతరం సిపిఐ పార్టీ 100 సంవత్సరాల కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా రైతు కూలీ సంఘం ప్రధాన కార్యదర్శి నిమ్మల నరసింహులు, స్వరూప నాయక్, కొండా సత్యం సాగర్, రాజు, ఎల్లయ్య, కురుమయ్య, రాజు నాయక్, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.