26-12-2025 07:39:18 PM
అఖిలపక్షం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ
చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని శివనేనిగూడెం లో ఉన్న డంపింగ్ యార్డ్ ను అక్కడి నుండి తొలగించి మరొక చోటుకు మార్చాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో శుక్రవారం సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. సంతకాల సేకరణ అనంతరం సంతకాల ప్రతులను నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య లకు అందజేశారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ శివనేనిగూడెంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ వల్ల పర్యావరణం దెబ్బతిని ప్రజలు తీవ్ర అనారోగ్యాల కు గురవుతున్నారని వెంటనే డంపింగ్ యార్డ్ ను అక్కడినుండి మరోచోటికి మార్చాలని కోరారు.