26-12-2025 09:06:48 PM
టీపీసీసీ రాష్ట్ర లీగల్ కన్వీనర్ కందుకూరి రజనీకాంత్
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక చిల్లర రాజకీయాలు చేస్తూ కవ్వింపు చర్యలకు తెరలేపుతున్నారని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, టీపీసీసీ లీగల్ రాష్ట్ర కన్వీనర్ కందుకూరి రజినీకాంత్ పేర్కొన్నారు. శుక్రవారం 56వ డివిజన్ కాంతయ్య నగర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... క్రిస్మస్ సందర్భంగా డివిజన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కొందరు అక్కసుతో, ఉద్దేశపూర్వకంగా బ్యానర్లను చింపి తొలగించారని పేర్కొన్నారు.
రాజకీయంగా నన్ను ఎదుర్కొనే దమ్ము లేక ఇటీవల వలస వచ్చిన కొందరు వలసవాదులు ఈదుశ్చర్యలకు ఒడిగట్టారని ఆరోపించారు. మూడు తరాలుగా కాంగ్రెస్ పార్టీలో కష్టపడి కార్యకర్తలు కాపాడుకుంటూ పార్టీ కోసం పనిచేస్తున్న మా కుటుంబం పై స్వార్థంతో పార్టీలో చేరిన వలసవాదులు చేస్తున్న రచకాలను కార్యకర్తలు గమనిస్తున్నారని తెలిపారు. డబ్బు అహంకారంతో దళితులను రాజకీయంగా అణచివేయాలని చూస్తే డివిజన్ ప్రజలు తరిమికొట్టే పరిస్థితి వస్తుందని మండిపడ్డారు.
దౌర్జన్యంగా ఫ్లెక్సీలు చింపిన వారిపై చట్ట పర్యావరణ చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రాజకీయాల కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని పార్టీ పెద్దలను కోరినట్లు తెలిపారు. ఇలాంటి రెచ్చగొట్టే పనుల వల్ల స్థానికంగా శాంతిభద్రతలకు ఇబ్బందులు కలుగుతాయని విన్నవించుకున్నారు. ఫ్లెక్సీలను చింపిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ కార్యక్రమంలో గిన్నారపు రాజు, కందుకూరి మహేందర్, శ్రీనాథ్, ప్రవీణ్, మహేష్, సతీష్, చందు, కర్ణాకర్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.