calender_icon.png 26 December, 2025 | 9:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

కలెక్టరేట్ ముట్టడని విజయవంతం చేయండి: కల్లోజు శ్రీనివాస్

26-12-2025 07:45:49 PM

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): ప్రభుత్వం కొత్తగా తెచ్చిన జీ.ఓ 252 ను సవరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 27 అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయాల ముందు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించాలని రాష్ట్ర పిలుపులో భాగంగా రేపు చలో కలెక్టరేట్ కు జిల్లా అధ్యక్షులు కల్లోజీ శ్రీనివాస్  పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం జీఓ ను సవరించాలని తాము కోరుకుంటున్నామని, ఒకవేళ తాత్సారం చేస్తే రాజ్యాంగం కల్పించిన హక్కుగా ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని ప్రకటించారు. కలెక్టరేట్ ముందు ఆందోళన కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న మన యూనియన్ రాష్ట్ర, జిల్లా నాయకులు, జిల్లా కమిటీ సభ్యులు, డెస్క్ జర్నలిస్టులు, సబ్ ఎడిటర్ లు, ఫోటో గ్రాఫర్ లు పాల్గొని విజయవంతం చేయాలనీ  కోరారు.