calender_icon.png 26 December, 2025 | 10:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ సంక్షేమ పథకాలను గ్రామంలో అర్హులైన ప్రతి ఒకరికి అందాలి

26-12-2025 09:11:50 PM

కన్నాయిగూడెం,(విజయక్రాంతి): ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మన గ్రామంలో ఉన్న పేదలకు అందేలా చేసి గ్రామ అభివృద్ధి చేయాలని ముప్పనపల్లి నూతన సర్పంచు తిప్పనపల్లి లక్ష్మయ్యను పొదుపు మహిళ సంఘాల మహిళలు పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచు మాట్లాడుతూ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముప్పనపల్లి గ్రామానికి ఇస్తున్న నిధులను ప్రతి పైస అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగిస్తానని

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ముప్పనపల్లి గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామం అభివృద్ధి చెందాలంటే ప్రజాప్రతినిధులు సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. గ్రామ అభివృద్ధి ఖచ్చితంగా చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాజరాజేశ్వరి, విణ్నేశ్వర, గణేష్, ధనలక్ష్మి పొదుపు మహిళ సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు.