26-12-2025 07:47:48 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఏఎంసీ గ్రౌండ్ లో మురళి మెమోరియల్ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ను అట్టహాసంగా నిర్వహించారు. శుక్రవారం ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ను బెల్లంపల్లి ఏసీపీ ఎ. రవికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులు పెడమార్గం పట్టకుండా ఇలాంటి క్రికెట్ టోర్నమెంట్లు ఎంతగానో అవసరమన్నారు. క్రీడల్లో మంచి నైపుణ్యాన్ని సాధించి బెల్లంపల్లికి పేరు తేవాలన్నారు.
ఈ లీగ్ టోర్నమెంట్ ను మూడు విభాగాలుగా ఏబీసీ పేరుతో విభజించి పోటీలు నిర్వహిస్తున్నారు. నాలుగు రోజులపాటు ఈ పోటీలు జరుగుతాయి. ఈ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి, కాంగ్రెస్ బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్య, సీనియర్ క్రికెటర్ ఈగ వెంకటస్వామి, అకాడమీ ఇన్చార్జ్ అల్లం వెంకటేశ్వర్లు కోచ్ జాడి శేఖర్, సీనియర్ క్రికెటర్లు బూదే సత్తి, గీస రాములు, జి శ్రీనివాస్ చారి, అల్లం గౌతం, పీ ఏ టీ హరీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.