16 April, 2026 | 8:17 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

ప్రజలకు నిరంతరం అండగా ఉండండి

26-12-2025 08:42 PM

- ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించండి 

- కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను చెప్పండి

 సర్పంచుల అభినందన సభలో దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి 

దేవరకద్ర: ప్రజాపాలన ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తూ అడుగులు వేస్తుందని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఒక్కనియోజకవర్గ కేంద్రంలో చిన్న చింతకుంట, కౌకుంట్ల, దేవరకద్ర మండలాల సర్పంచులు, ఉపసర్పంచ్ లు, వార్డ్ మెంబర్లతో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొని నూతన ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యే ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ఎన్నికల ఫలితాలే రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో పునరావృతం అవుతాయి, రాష్ట్రంలో మరోసారి రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, కష్టపడి పని చేసి ప్రజల మన్ననలు పొంది, పార్టీకి మంచి పేరు తీసుకురావాలన్నారు. మూడు విడతలుగా జరిగిన సర్పంచ్‌ ఎన్నికల్లో దేవరకద్ర నియోజకవర్గంలో 134 సీట్ల గాను కాంగ్రెస్ పార్టీ 93 స్థానాలు 70% సీట్లు గెలుచుకున్నామని, బిఆర్ఎస్, బిజెపి లను ప్రజలు తిరస్కరించారన్నారు. 

సర్పంచులుగా గెలిచిన వ్యక్తులు మీ ప్రాంతాల్లోని సమస్యలను ఎప్పటికప్పుడు నోట్ చేసుకుని తీసుకురండి, సమస్యలను పరిష్కరిద్దామన్నారు. గెలిచిన సర్పంచ్ లు అధికారులతో సమన్వయంతో పనిచేస్తూ, గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రామాల అభివృద్ధికి చిన్న గ్రామపంచాయతీలకు 5లక్షలు, మేజర్ గ్రామపంచాయతీ కి 10 లక్షల నిధులు ఇస్తామని ప్రకటించారన్నారు. ప్రభుత్వం పై బిఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టాలి - బిఆర్ఎస్ రాష్ట్రాన్ని ఆర్థికంగా విధ్వంసం చేసిన, ఆర్థిక వ్యవస్థ ను చక్కదిద్దుకుంటూ ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని,దేవరకద్ర నియోజకవర్గంలో 224 కోట్ల ఋణమాఫీ జరిగింది, 46000 కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందుతోందన్నారు.