calender_icon.png 26 December, 2025 | 9:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

విద్యుత్ వినియోగం పట్ల మండల పరిషత్ అధికారుల ఆశ్రద్ధ

26-12-2025 07:33:26 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయం సముదాయంలో గల మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీఓ,ఎంపీడీవో కార్యాలయాల్లో గత రెండు రోజుల నుండి నిరంతరం విద్యుత్తు లైట్లు వెలుగుతున్నాయి. అసలే కార్యాలయాలకు విద్యుత్ వినియోగభారం ఎక్కువ పడుతుంటే వాటిని చెల్లించలేని పరిస్థితుల్లో కార్యాలయాల ఆదాయ పరిస్థితులు ఉండగా గత రెండు రోజులుగా రెండు కార్యాలయాల్లో విద్యుత్ దీపాలు నిరంతరం వెలగడం అధికారుల అశ్రద్ధకు నిదర్శనం కాదా? కార్యాలయాలలో పనిచేసే అటెండర్లు ఈ విద్యుత్ దీపాల వెలుగు అవసరతలను గుర్తించి విద్యుత్ దీపాలను ఆపివేయాలి.

కానీ మండల కేంద్రంలోని అటెండర్లు నియమించుకున్న ఒక ప్రైవేటు అటెండర్ ఆదీపాలను ఆర్పి వేయాలి కానీ అటెండర్రు చేయవలసిన పనిని చేయలేక వారు స్థానికంగా లేని అటెండర్లు వారు కూడా అధికారుల తీరులో స్థానికంగా ఉండే వ్యక్తిని అటెండర్గా నియమించుకున్నారు. అటెండర్ల నియమించుకున్న (ప్రైవేట్) అటెండర్ విద్యుత్ దీపాల అవసరతను గుర్తించి అవసరమైనప్పుడు విద్యుత్ దీపాలను వాడుకోవడం అవసరం లేనప్పుడు వాటిని ఆప్ చేసి విద్యుత్ ఆదా చేసుకోవాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా కార్యాలయాల్లో విద్యుత్ను ఉపయోగించడం వల్ల కార్యాలయాల్లో విద్యుత్ బిల్లు అధికంగా రావడం ఆవిద్యుత్ బిల్లును చెల్లించడంలో కార్యాలయాలు ఉండడం ఉన్నత అధికారులకు తెలియదా మండల పరిపాలన అధికారులకు కనీసం విద్యుత్ వినియోగం ఇలా వాడుకోవాలో తెలియకపోవడం సిగ్గుచేటు అని పలు అభిప్రాయాలు ఉన్నాయి.

కార్యాలయాల్లో ఇష్టానుసారంగా విద్యుత్తు వినియోగం చేస్తూ తడిసి మోపడేటట్టు బిల్లులు రావడం ఆబిల్లు చెల్లించలేని పరిస్థితి పరిస్థితిని ఎదుర్కోవడం అధికారులకు విద్యుత్ వినియోగం పట్ల పట్టింపులు లేకుండా ప్రజల సొమ్ము వృధా చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి.ఇలా ప్రభుత్వ కార్యాలయాల్లో వృధాగా విద్యుత్ వినియోగం చేసుకుంటూ బిల్లులు తడిసి మోపిడైన కార్యాలయాల్లో అధికారుల వద్ద అధికారులు బిల్లులు వసూలు చేయడం చేతకాదు కాని గ్రామాలలో పేదల వద్ద ఒక రెండు మూడు నెలలు బిల్లులు చెల్లించకుంటే వారి ఇంటికి సరపరాయే విద్యుత్ సరఫరాను నిలిపివేస్తారు.

కార్యాలయాల్లో బకాయి ఉన్న బిల్లులు వసూలు చేయడం చేతకాదు కానీ గ్రామాల్లో పేద ప్రజల  ఇండ్లకు సరపర నిలిపివేస్తారు. ఎందుకంటే ప్రజలను ఇంతగా చులకన చూడడం కార్యాలయాల్లో బిల్లులు వసూలు చేయలేని విద్యుత్ శాఖ అసమర్ధత  అభిప్రాయాలు ఉన్నాయి. అన్ని కార్యాలయాల్లో విద్యుత్ శాఖ బకాయిలు వసూలు చేస్తే లక్షలు వస్తాయి. విద్యుత్ శాఖ ప్రభుత్వ పాలనలో అదికూడా ఒక శాఖ బాగామే కాబట్టి ప్రభుత్వ కార్యాలయాల్లో బకాయిలు వసూలు చేయడం పట్ల అశ్రద్ధ వహిస్తున్నారని అభిప్రాయాలు ఉన్నాయి.