20-08-2025 01:22:23 AM
జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పహార్ ను కలిసిన సిపిఐ మండల కమిటీ
గరిడేపల్లి,ఆగస్ట్19,(విజయక్రాంతి): ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ మండల సిపిఐ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్ దృష్టికి తీసుకొచ్చారు.ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోకల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేద ప్రజల కోసం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ళను మండలానికి ఒక గ్రామం కాకుండా అన్ని గ్రామాలకు ఇవ్వాలని ఆయన కోరారు.
అర్హులైన అందరికీ ఇంటి స్థలముతో పాటు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.గరిడేపల్లి మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ కు వారు ఈ విషయాన్ని తెలిపారు.ఇంటి స్థలం లేని నిరుపేదలు మండలంలో అనేకమంది ఉన్నారని,వారందరికీ ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు.ఇంటి స్థలం లేని నిరుపేదలందరికీ ప్రభుత్వం వెంటనే నివాస స్థలాలను కేటాయించి,ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి వారికి న్యాయం చేయాలని కోరారు.అనంతరం తహసిల్దార్ బండ కవితకు వారు వినతి పత్రం అందజేశారు.