calender_icon.png 20 August, 2025 | 6:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీల గొంతులో పచ్చి వెలక్కాయ.. బీఆర్‌ఎస్‌కు పరీక్షే!

20-08-2025 01:21:20 AM

  1. ఉపరాష్ట్రపతి ‘ఇండియా’ అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని కాదనేదెట్లా?
  2. ఏపీలోని టీడీపీ, వైఎస్సార్‌సీపీ, జనసేన పార్టీలకూ మింగుడుపడని వైనం

హైదరాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి) : ఉప రాష్ట్రపతి పదవికి అభ్యర్థిత్వం కోసం ఇండియా కూటమి తరఫున జస్టిస్ సుదర్శన్‌రెడ్డి పేరును ప్రకటించడంతో, తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీ లు.. ముఖ్యంగా తెలంగాణలోని బీఆర్‌ఎస్ పార్టీకి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయ్యిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని తెరపైకి తీసుకురావడంతో నిజానికి తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ మినహా అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఏం చేద్దామనే పరిస్థితి తలెత్తింది.

దక్షిణాది వ్యూహానికి సరైన ప్రతివ్యూహం..

గడిచిన కొంతకాలంగా దక్షిణాదిపై బీజేపీ దృష్టి సారించింది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వ్యూహాన్ని అమలుచేస్తూ.. రాజకీయ పార్టీలను ముప్పుతిప్పలు పెడుతూ.. ప్రభుత్వాలను చేజిక్కించుకో వాలనే ఆలోచనతో బీజేపీ ముందుకు సాగుతోంది. 2026లో దక్షిణాదిలో పెద్ద రాష్ట్రమైన తమిళనాడులో ఎన్నికలు ఉన్న నేపథ్యం లో.. దక్షిణాదిలో పాగా వేయడానికి ఉప రా ష్ట్రపతి అనే పదవిని ఎరగా వాడుకోవాలని తలచి.. మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను ఎన్డీయే తరఫున ఎంపిక చేసినట్టు ప్రక టించారు.

పైగా రాధాకృష్ణన్ బలహీన వర్గాలకు చెందిన నేత. కాకపోతే కరుడుగట్టిన ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం కలిగిన వ్యక్తి. దీనితో బీజేపీ దక్షిణాది వ్యూహానికి ఇండియా కూట మి ఎలా చెక్ పెడుతుందనే ఉత్కంఠ అందరిలోనూ మొదలయ్యింది. ఈ నేపథ్యంలో జస్టిస్ సుదర్శన్‌రెడ్డి పేరును వ్యూహాత్మకంగా తెరపైకి తీసుకొచ్చారు.

ఏ రాజకీయ పార్టీ నే పథ్యం లేకపోవడం, పైగా సుప్రీంకోర్టు న్యా యమూర్తిగా పనిచేసిన అనుభవం దృష్ట్యా బీజేపీ దక్షిణాది వ్యూహానికి చెక్ పెట్టినట్టుగానే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జస్టిస్ సుదర్శన్‌రెడ్డి అభ్యర్థిత్వం అనేది బీజేపీకి కాస్త మింగుడు పడనిదేనని వారంటున్నారు. 

కక్కా మింగలేని బీఆర్‌ఎస్..

 తెలంగాణ విషయానికి వస్తే ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ప్రకటనతో బీఆర్‌ఎస్‌కు కక్కామింగలేని విధం గా మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలుగు ఆత్మాభిమానంతో పాటు తెలంగాణకు చెందినజస్టిస్ సుదర్శన్‌రెడ్డికి వ్యతిరేకంగా ఎలా ముందుకు వెళతారా అనే ది అందరినీ ఆలోచింపచేస్తున్న అంశం. కేవ లం తెలంగాణ కోసమే పుట్టిన టీఆర్‌ఎస్.. కాలగమనంలో బీఆర్‌ఎస్ అయినప్పటికీ.. తెలంగాణ వ్యక్తిని వ్యతిరేకించడమంటే.. తమ తెలంగాణ అనే అస్థిత్వాన్ని వదులుకోవడమనే చెప్పవచ్చు.

ఎన్డీయే అభ్యర్థివైపు మొగ్గితే.. బీఆర్‌ఎస్‌పై ప్రజల్లో విశ్వాసం పోతుందని, అదే ఇండియా కూటమికి మద్దత్తు ఇస్తే.. కాంగ్రెస్ పరిపాలనకు మద్దత్తు ఇవ్వడమేననే చర్చ మొదలయ్యింది. మొత్తానికి బీఆర్‌ఎస్‌కు మాత్రం ఇండియా కూటమి అభ్యర్థి ఎంపిక అనేది కక్కా మింగలేని పరిస్థితిని సృష్టించిందనే చెప్పవచ్చు. 

తెలుగు రాష్ట్రాల మద్దతు?

గతంలో తెలుగుదేశం వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు తట్టిలేపిన తెలుగు ఆత్మాభిమానం అనే నినాదం.. ఇండి యా కూటమి అభ్యర్థిగా తెలంగాణ బిడ్డను ప్రకటించడంతో మరోసారి తెలుగు రాష్ట్రాల్లోనూ మొదలయ్యే అవకాశం స్పష్టంగా ఉందని విశ్లేషకుల అభిప్రాయం. తెలుగు వ్యక్తికి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని, పార్టీలకు అతీతంగా తెలుగు ఆత్మాభిమానాన్ని చాటాలనేది బలంగా ముందుకు వెళుతుందని అంటున్నారు.

ఎన్డీయేలో భాగస్వాములైన టీడీపీ, జనసేన, బయటి నుంచి మద్ద తు ఇస్తున్న వైసీపీ పార్టీల వ్యవహారాలను ప్రజలు గమనించే పరిస్థితి ఉత్పన్నమైనట్టుగానే చెప్పవచ్చు.  ప్రజల్లో తమ పార్టీ పట్టు జారకుం డా చూసుకోవాలంటే.. తెలుగు వ్య క్తికి మద్దతు ఇవ్వకతప్పదా అనే మీ మాంసలో పార్టీలు కొట్టుమిట్టాడక తప్పదు.

ఒకవేళ తెలుగు ఆ త్మాభిమానాన్ని పక్కనపెడితే.. ప్రజలకు ఏం చెప్పుకోవాలనే సందిగ్ధం కూ డా వారిని వెంటాడుతుంది. తెలుగు ప్రజల గురించి మాట్లాడే టీడీపీ, జనసేన, వైసీపీలు ఇప్పుడేం చేస్తాయనే ఉత్కంఠ నెలకొంది.  ఎన్డీయే లో భాగస్వామ్యంగా ఉన్న టీడీపీ, జనసేన రాధాకృష్ణన్‌కు మద్దతునిస్తాయనడంలో సందేహమే లేదు. తెలుగువాడికి మద్దతునివ్వాలన్న సూత్రం ఆ పార్టీలకు పనిచేయదు.