6 May, 2026 | 2:01 PM

పెంచిన గ్యాస్ ధరలు, పెట్రోల్, డీజిల్ కొరతపై సీపీఐ ఆందోళన

06-05-2026 01:27 PM

బెల్లంపల్లి, (విజయ క్రాంతి): కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను, పెట్రోల్, డీజిల్ కొరత కు నిరసనగా  బెల్లంపల్లిలో కాంట చౌరస్తా వద్ద సీపీఐ  ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి దాగం మల్లేష్, పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి గారు మాట్లాడుతూ రాష్ట్రంలో గ్యాస్ పెట్రోల్ డీజిల్ అధిక ధరలు కొరత వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. రాష్ట్రంలో పంట కోతల సమయంలో డీజిల్ లేకపోవడంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొరతలేదని పాలకులు ప్రకటిస్తున్నప్పటికీ ఆచరణలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను పట్టించుకోవడం లేదనీ మండిపడ్డారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే కేంద్ర ప్రభుత్వం వాణిజ్య సిలిండర్ల ధరలను రూ. 993 పెంచడంతో రూ.3100 కు చేరుకున్నదన్నారు. సామాన్య ప్రజలు అలాగే డీజిల్ పెట్రోల్ మీద లీటరుకు 5/-రూపాలు గృహ అవసరాల గ్యాస్ సిలిండర్ పై 50 రూపాయలు పెంచడానికి ఆయిల్ కంపెనీలు ప్రతిపాదనలు పంపించేయని తెలిపారు. అమెరికా సామ్రాజ్యవాద విధానాలను మోడీ ప్రభుత్వం వ్యతిరేకించకపోవడం యుద్ధం కంటే ముందు బ్యారెల్ ముడిచమరుద్దర 72 డాలర్లు ఉంటే ఇప్పుడు 126 డాలర్లకు చేరుకున్నదినీ తెలిపారు.

తాజ గా కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరల వలన హోటల్స్, రెస్టారెంట్లు, చిన్న పెద్ద ఆహార వ్యాపారాల మీద పడుతున్నదనీ వాపోయారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచినట్లయితే నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి ద్రవియోల్బణం పెరుగుతుందన్నారు.  అమెరికా ఇరాన్ యుద్ధం వలన భారతదేశానికి ఎలాంటి ప్రమాదం లేదని, చమురు గ్యాస్ నిలువలు ఉన్నాయని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఎందుకు గ్యాస్ ధరలు పెంచుతున్నట్లు, పెట్రోల్ బంకుల వద్ద ఎందుకు బారులు తీరిన జనం ఎందుకు ఉన్నారో చెప్పాలని ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వం పొంతన లేని సమాధానా లతో ప్రజల ను మోసం చేస్తున్నదని విమర్శించారు.పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని, డిజిల్ కొరతలను నివారించాలని, ఆయిల్ కంపెనీల ప్రతిపాదనలు ఆమోదించవద్దని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ సహాయ కార్యదర్శి బొల్లం తిలక్ అంబేద్కర్, బెల్లంపల్లి మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ, జిల్లా సమితి సభ్యులు డిఆర్ శ్రీధర్, కొంకుల రాజేష్, రత్నం రాజం, మేకల రాజేశం, సీనియర్ నాయకులు జూపాక కొమురయ్య, మహిళా సమాఖ్య నాయకురాలు బొంతల కళారాణి,  స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.