31-07-2025 07:32:45 PM
సిపిఐ రిలే నిరాహార దీక్ష
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రం నడిబొడ్డున సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన 50 కోట్ల విలువైన ఓసి క్లబ్ ను వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ ఓసి క్లబ్ ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు గురువారం మున్సిపల్ సిపిఐ మాజీ ఫ్లోర్ లీడర్ అజయ్ సారధి రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి కొందరు ప్రైవేటు వ్యక్తులు తమ చేతుల్లోకి తీసుకున్నారని, ప్రభుత్వ భూమి కబ్జాకు గురికాకుండా కాపాడాలని మహబూబాబాద్ ఎంపీ, ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వెళ్ళామని చెప్పారు. ప్రభుత్వం ఈ విషయంలో స్పందించకపోతే ఓసి క్లబ్ స్వాధీనం కొరకు దశల వారి ఆందోళన చేస్తామని ఆగస్టు 4న కలెక్టరేట్ ముట్టడి చేపట్టనున్నట్లు ప్రకటించారు.