calender_icon.png 2 August, 2025 | 6:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి

01-08-2025 02:59:37 PM

బిజెపి మండల అధ్యక్షులు జనార్ధన్ - 

మందమర్రి, (విజయక్రాంతి): త్వరలో జరగనున్న స్థానిక సంస్థల(local body elections) ఎన్నికల్లో మండలం లోని అన్ని ఎంపీటీసీ, గ్రామపంచాయతీ, జెడ్పిటిసి స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేసి మండలంలో కాషాయ జెండాను ఎగుర వేయాలని బిజెపి మండల అధ్యక్షులు గిర్నాటి జనార్దన్ కోరారు. మండలం లోని బొక్కలగుట్ట గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన బూత్ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. స్థానిక సమస్యల పరిష్కారం కోసం ఉద్యమి స్తూనే పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని సూచించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామాలలో విస్తృతంగా ప్రచారం చేసి త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో  మెజార్టీ స్థానాలు విజయం సాధించి కాషాయం జెండాను ఎగరేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నాయకులు పోలింగ్ బూత్ ల వారిగా పార్టీని బలోపేతం చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. బూత్ అధ్యక్షులు బండోజు సాయి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీనియర్ నాయకులు డివి దీక్షితులు, దేవరనేని సంజీవరావు, బంగారి వేణు, మండల ప్రధాన కార్యదర్శులు వంజరి వెంకటేష్, అజ్మీర రాజేష్, ఉపాధ్యక్షులు ఉప్పుల రాజు, పల్లె ఓదన్న, పోరెడ్డి మొండి, బానోత్ శ్రీను, చింతకింది రాజేష్, కటుకూరి సతీష్ లు పాల్గొన్నారు.