calender_icon.png 2 August, 2025 | 6:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సభలు, ర్యాలీలకు అనుమతి తప్పనిసరి

01-08-2025 02:58:03 PM

ఆగస్టు 30 వరకు పోలీస్ యాక్ట్ అమలు 

జిల్లా ఎస్పీ డి జానకి

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): ఈనెల 30వ తేదీ వరకు పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని సభలకు సమావేశాలకు ర్యాలీలకు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి జానకి(Mahabubnagar District SP D Janaki) స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా, ప్రశాంతత ను పెంపొందించేందుకు నేటి నుంచినుండి ఈనెల 30వ తేదీ వరకు జిల్లా అంతటా 30 పోలీస్ ఆక్ట్ 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డి.జానకి ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ 30 పోలీస్ఆక్ట్ 1861 అమలులో ఉన్నందున జిల్లాలో సబ్ డివిజనల్ పోలీస్ అధికారి,  పోలీస్ ఉన్నత అధికారుల నుంచి అనుమతి లేకుండా ఎటువంటి పబ్లిక్ మీటింగులు, ఊరేగింపులు, ధర్నాలు జరుపరాదన్నారు. నిషేదిత ఆయుధములు అయిన కత్తులు, చాకులు, కర్రలు, జెండా కర్రలు, దుడ్డుకర్రలు, తుపాకులు ప్రేలుడు పదార్థములు, నేరమునకు పురిగొల్పే ఎటువంటి ఆయుధములను వాడరాదని పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బంది, చిరాకు కలిగించేందుకు దారితీసే పబ్లిక్ మీటింగ్ లను మరియు జనసమూహం ప్రోగు అవుట వంటివి నిషేధమన్నారు. రాళ్ళను జమ చేయుట,  ధరించి సంచరించుట వంటివి నిషేధం. లౌడ్ స్పీకర్ లు, డీజే లు వంటివి కూడా ఈ సమయంలో వినియోగించకూడదని పేర్కొన్నారు. నియమాలు ఎవరైనా ఉల్లంఘించిన  30 పోలీస్ ఆక్ట్ 1861 కింద శిక్షార్హులు అవుతారని తెలియజేశారు.