calender_icon.png 2 August, 2025 | 6:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంపీడీఓ మారయ్యకు వినతి పత్రం అందజేత

01-08-2025 02:55:41 PM

నాగారం: సూర్యాపేట జిల్లా(Suryapet District) నాగారం మండల కేంద్రనికి ప్రజాపాలనలో ఇందిరమ్మ రాజ్యంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల ఇటీవల మంజూరు అయిన 24 ఇందిరమ్మ ఇండ్లకు అదనంగా మరొక 100 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి అర్హులైన నిరుపేదలకు  మంజూరు చేయాలనీ కోరుతూ నాగారం బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో నాగారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఎంపీడీఓ మారయ్యకి వినతిపత్రం అందజేశారు. మాట్లాడుతూ అర్హులైన పేదలకు నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందించాలి లేనిపక్షంలో ధర్నాలు ,రాస్తారోకోలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఎల్క సైదులు బిఆర్ఎస్ నాయకులు కూరం వెంకన్న, చిప్పలపల్లి చిరంజీవి, గంట నర్సయ్య, పానగంటి వెంకన్న ,కడారి లింగామల్లు, చిప్పలపల్లి యల్లయ్య, మధు, సురేష్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.