calender_icon.png 2 August, 2025 | 6:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదోన్నతులు బాధ్యతను పెంచుతాయి

01-08-2025 03:06:04 PM

సిద్దిపేట క్రైమ్: పోలీస్ శాఖలో పదోన్నతులు మరింత బాధ్యతను పెంచుతాయని కమిషనర్ బి.అనురాధ అన్నారు. సిద్దిపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ నుంచి ఎస్ఐగా ప్రమోషన్ పొందిన ఎన్.ఉమేష్, హుస్నాబాద్ పోలీస్ స్టేషన్(Husnabad Police Station)లో  హెడ్ కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐగా ప్రమోషన్ పొందిన జి.సదయ్యలను ఆమె అభినందించారు. వారు కమిషనర్ కు పుష్పగుచ్చాలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. పదోన్నతులు పొందిన పోలీస్ సిబ్బంది రెట్టించిన ఉత్సాహంతో ప్రజలకు సేవలు అందించాలని కోరారు. పోలీసు శాఖలో క్రమశిక్షణ, బాధ్యత, విధుల పట్ల నిబద్ధతతో వ్యవహరించే ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు, గౌరవ మర్యాదలు లభిస్తాయన్నారు. కార్యక్రమంలో ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీధర్ గౌడ్, రాష్ట్ర పోలీసు సంఘం ఉపాధ్యక్షుడు రవీందర్ రెడ్డి  పాల్గొన్నారు.