01-08-2025 03:04:40 PM
మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ర్యాలీగఢ్‌పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని దుర్గాదేవి (క్వారీ) అమ్మ వారిని తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్(Police Academy Director) అభిలాష్ బిస్త్ దర్శించుకున్నారు. శుక్రవారం మంచిర్యాల జోన్ పోలీస్ అధికారులతో సమావేశం సందర్భంగా మంచిర్యాల వచ్చిన పోలీస్ అకాడమీ డైరెక్టర్ క్వారీ దుర్గా దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదాశీర్వచనం చేసి అమ్మ వారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రంతో అర్చకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లారెడ్డి, మంచిర్యాల పట్టణ సి ఐ ప్రమోద్ రావు, మంచిర్యాల రూరల్ సీఐ అశోక్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.