01-08-2025 02:54:09 PM
కేంద్ర రాష్ట్ర నిధులతో మరింత ఉపయోగకరం
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): అసత్యాలను నమ్మకూడదని మహబూబ్ నగర్ నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకుందామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) అన్నారు. శుక్రవారం నగరపాలక సంస్థ పరిధిలోని భగీరథ కాలనీ లో రూ 20 లక్షలు ,అలీస్ మార్ట్ దగ్గర రూ 25 లక్షలు ముడా నిధులతో నూతనంగా నిర్మించనున్న పార్క్ల నిర్మాణపు పనులకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపాలిటీ గా ఉన్న మహబూబ్ నగర్ ను మున్సిపల్ కార్పొరేషన్ గా అభివృద్ధి చేసుకోవడం జరిగిందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అత్యధిక సంఖ్యలో నిధులు తెచ్చి మహబూబ్ నగర్ ను అద్బుతంగా అభివృద్ధి చేస్తామన్నారు.
మహబూబ్ నగర్ నగర పాలక సంస్థ పరిధిలోని ప్రతి డివిజన్ లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన స్పష్టం చేశారు. గత ప్రభుత్వము వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందని ఆహ్వానం వ్యక్తం చేశారు. వాస్తవాలను ముందు ఉంచుతూ అభివృద్ధి పనులను చేసుకుంటూ ముందుకు సాగుతున్నామన్నారు. గతంలో చెప్పిన మాటలకు చేసిన పనులకు అసలు పొంతనలేదని స్పష్టం చేశారు. ప్రజలు మనసుపెట్టి ఆలోచన చేయాలని అభివృద్ధి ఎంత వేగంగా జరుగుతుందో ఒక్కసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పనులు చేయకుండా కేవలం ప్రచారం చేసుకోవడం తమకు తెలియదని, అభివృద్ధి తమ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, అజ్మత్ అలి, నాయకులు కృష్ణకాంత్ రెడ్డి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు ప్రశాంత్ , తిరుమల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.