01-08-2025 03:01:00 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్,( విజయక్రాంతి): హనుమకొండలో జిల్లాలో ఈనెల 3,4 తేదీలలో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు(state-level athletics competitions) గిరిజన క్రీడా పాఠశాల విద్యార్థులు 12 మంది ఎంపికయ్యారని గిరిజన క్రీడల అధికారి బండమీనారెడ్డి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు జంగు తెలిపారు, ఎంపిక అయిన విద్యార్థులు మాడవి చిన్ను బాయ్ 10th ,ఆలం శైలజ 10th ,ఆడే నందిని 10th,సురేండ్ల శరణ్య 10th ,రాథోడ్ మైని 10th,బిమేశ్వరి 10th ,మెడే శాంతి 10th ,మెశ్రమ్ రాజేశ్వరి 9th ,మరపు ప్రవళిక 8th,ఆత్రం లావణ్య 8th,మరప కమల 8th ,నైతం జయశ్రీ 8th ఎంపికయిన విద్యార్థులను ఉద్దేశించి గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆర్ రమాదేవి మాట్లాడుతూ ఈ విద్య సంవత్సరం మొదటి కాంపిటీషన్ కు వెళుతున్న విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీల్లో పథకాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఏ సి ఎం ఓ ఉద్దవ్, డి ఎస్ ఓ మీనా రెడ్డి, జి సి డి ఓ శకుంతల, ఏ టి డి ఓ చిరంజీవి, హెచ్ డబ్ల్యు ఓ సాయి బాబా, శిక్షకులు విద్యాసాగర్, అరవింద్, తిరుమల్, పాఠశాల అధ్యాపక బృందం అభినదించారు.