23 August, 2026 | 8:29 PM

Breaking News

ప్రభుత్వగిరిజన బాలికల హాస్టల్ లో బోనాల పండుగ   •   దమ్మాయిగూడ–నాగారం 100 ఫీట్ల రోడ్డును 80 ఫీట్లకు కుదించాలి   •   యూరియా కొరత లేదు.... రైతులు ఆందోళన చెందొద్దు   •   శ్రీ రామలింగేశ్వర స్వామి, పార్వతీదేవి అమ్మవార్ల ఉపాలయాల ప్రతిష్ఠా మహోత్సవం   •   మానసిక వికలాంగ విద్యార్థులకు భోజన వితరణ   •   అమ్మవార్ల దయ జవహర్ నగర్ ప్రజలపై ఉండాలి   •   మైనార్టీ మహిళల అభివృద్ధికి ప్రభుత్వం అండ   •   ముత్యాలమ్మకి బోనం సమర్పించిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి   •   రోడ్డు ప్రమాద బాధితున్ని పరామర్శించిన జుక్కల్ ఎమ్మెల్యే   •   సొంత నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం అభినందనీయం: ఎమ్మెల్యే గూడెం   •  

ట్రాన్స్పోర్ట్ కార్మికుల సమ్మెకు సిపిఎం సంపూర్ణ మద్దతు

23-08-2026 07:53 PM

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్

కొత్తగూడెంటౌన్,ఆగస్టు23,(విజయక్రాంతి): ట్రాన్స్పోర్ట్ కార్మికుల సమ్మెకు(Transport workers' strike) సిపిఎం సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు తెలిపారు. స్థానిక మంచికంటి భవన్లో రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 23వ తేదీ అర్ధరాత్రి నుండి ఆటో కార్మికులు, ప్రైవేటు వ్యాను, స్కూల్ వ్యాన్లు బంద్ ను జయప్రదం చేయాలన్నారు.  ఈ బంద్ ప్రజలు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులకు  రూ 12 వేలు ఇస్తానన్న ఆర్థిక సహాయం ఇవ్వాలని ,ఆర్టీసీ సంస్థ తరఫున ఎలక్ట్రికల్ ఆటో వాహనాలు నడపాలని చేస్తున్న ప్రయత్నం రద్దు చేయాలని, రాపిడో ,ఓలా ,ఉబర్ రద్దుచేసి ప్రభుత్వమే  యాప్ ద్వారా రాపిడో సంస్థను నడపాలని తదితర సమస్యల సాధన కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 23వ తేదీ అర్ధరాత్రి నుంచి ఆటోలు బంద్ చేయాలని కార్మిక సంఘాల జేఎసి పిలుపు నివ్వడం జరిగిందన్నారు.

రవాణా శాఖ మంత్రి కార్మిక సంఘాలు చేపట్టిన బంద్ విరమించాలని ప్రకటనకే పరిమితం అయ్యారు, తప్ప కార్మిక సంఘాల జేఎసి తో ఎందుకు చర్చలు జరిపరని ప్రశ్నించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు రాష్ట్ర కమిటీ సభ్యులు ఎజె రమేష్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి అన్నవరపు సత్యనారాయణ  తదితరులు పాల్గొన్నారు.