జ్ఞాన సరస్వతి ఆలయంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠాపన
పాల్గొన్న ఎమ్మెల్యే పోచారం, ఆలయ ధర్మకర్త శంభు రెడ్డి
బాన్సువాడ, ఆగస్టు 23 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ కేంద్రంలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో( Sri Gnana Saraswati Temple) ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠాపన, నందీశ్వర స్థిర ప్రతిష్ఠాపన మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి,పుష్ప దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు అందించారు.ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త పోచారం శంభురెడ్డి,ప్రేమల దంపతులతో పాటు బాన్సువాడ పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న భక్తులు స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కార్యక్రమాన్ని ఆలయ నిర్వాహకులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు.






