కల్యాణాన్ని తిలకించి పులకించిన భక్త జనం
*ఖమ్మం లో ముస్లిం యూత్ ఆధ్వర్యంలో మజ్జిగ, మంచినీరు పంపిణీ
ఖమ్మం, ఏప్రిల్ 6 ( విజయక్రాంతి ):-ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శ్రీరామ నవమి సందర్బంగా సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవం గా జరిగా యి.అన్ని దేవాలయాల్లో రా ములోరి కళ్యాణాన్ని కన్నుల పండువుగా నిర్వహించారు. అశేషంగా తరలివచ్చిన భక్త జన సందోహం రామ నామ స్మరణ మధ్య జాగదభిరాముడు జానకమ్మల కళ్యాణం వేద మంత్రోత్సరణల తో అత్యంత ఘనంగా జరిగింది.భక్తులు నేత్రానందంగా స్వామి వారి కళ్యాణాన్ని తిలకించి పులకించిపోయారు. ఈ సందర్బంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచినీళ్లు, మజ్జిగ సరఫరా చేశారు. ఖమ్మం లో ముస్లిం సోదరులు కుల మతాలకతీతంగా ముందుకు వచ్చి భక్తులకు చల్లని నీరు, మజ్జిగ పంపిణీ చేసి, ముస్లిం హిందూ భాయి భాయి అని చాటారు. ఖమ్మం లోని 42వ డివిజన్ నిజాంపేట మైనార్టీ యూత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.






