09-08-2025 12:13:09 AM
భద్రాచలం, ఆగస్టు 8, (విజయ క్రాంతి):కేంద్ర ఎన్నికల సంఘం సమగ్ర ఓటర్ల సవరణ విధానాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం భద్రాచలం అంబేద్కర్ సెంటర్లో సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.నిరసన తెలియజేసిన అనంతరం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు బండారు శరత్ బాబు అధ్యక్షతన వేషం నిర్వహించారు.
సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి మాట్లాడుతూ రాబోయే కొద్ది కాలంలో బీహార్ లో జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అక్కడ ఏ విధంగా అయినా సరే అధికారాన్ని దక్కించు కోవాలనే ఉద్దేశంతో, అక్కడ అధికారంలో ఉన్నటువంటి , బిజెపి , ఎన్డీఏ, ప్రభుత్వం అనేక కుయుక్తులు కుట్రలకు పాల్పడుతూ ఎన్నికల సంఘాన్ని పావుగా ఉపయోగించుకొంటుందని ధ్వజమెత్తారు.
బీహార్ ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస పోయారు అనే పేరుతో బడుగు బలహీన వర్గాల ఓట్లు, ఒక మతానికి సంబంధించిన వారి ఓట్లు ఏకపక్షంగా తొలగిస్తూ సుమారుగా ఇప్పటికే 65 లక్షల ఓట్లను తొలగించడం జరిగిందన్నారు. ఇది సరైన విధానం కాదని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. వెంటనే ఆ విధానాన్ని రద్దు చేసి గతంలో నమోదైన ఓటర్లందరి నీ కొనసాగించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్య దర్శి వర్గ సభ్యులు వై వెంకట్రామా రావు, పట్టణ కమిటీ సభ్యులు, ఎన్ ,నాగరాజు, కొలగాని రమేష్ , కోరాడ శ్రీనివాస్ ,ఎస్ డి ఫిరోజ్, ఎస్ అజయ్ కుమార్ ,డి రాఘవయ్య ,రవి, మురళీకృష్ణ ,నాగమ్మ, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.